బంగారం ధర క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన గోల్డ్ రేట్లో ఒక్కసారిగా తగ్గుదల కనిపించింది. శుక్రవారం తులంపై రూ. 180 తగ్గగా, తాజాగా శనివారం ఒక్క రోజే మళ్లీ రూ. 200 వరకు తగ్గడం విశేషం. దీంతో కేవలం రెండు రోజుల్లోనే తులంపై ఏకంగా రూ. 380 వరకు తగ్గుముఖం పట్టడం గమనార్హం. శనివారం 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 200 తగ్గి 10 గ్రాముల బంగారం రూ. 54,850కి చేరింది. ఇక […]
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దాని ద్వారా వీడియోస్ ను […]
హలో.. నేను మున్సిపల్ ఆఫీస్ బిల్ కలెక్టర్ ను మాట్లాడుతున్నాను.. మీ ట్రేడ్ లైసెన్స్ బాకీ ఉంది.. వెంటనే చెల్లిస్తారా లేక మీ షాప్ సీజ్ చేయాలా..? అని ఇంటిపేరు, ఊరు పేరు, షాప్ పేరు, షాప్ నెంబర్ తో సహా చెప్పి ఘరానా దోపిడీలకు తెర లేపారు కేటుగాళ్లు. కొందరు వ్యాపారులు ఆ కేటుగాళ్ళ బెదిరింపులు అంతా సెల్ ఫోన్ లో ఆడియో రికార్డు చేయడంతో అసలు బండారం బయటపడింది. మున్సిపాలిటీలో ఇంటి దొంగలపై అనేక […]
లో బీపీ ఉన్నవారికి తరచుగా తల తిరగడం.. విశ్రాంతి లేకపోవడం.. తలనొప్పి వంటి సమస్యలు కనిపిస్తుంటాయి. అయితే లో బీపీకి, తలతిరగడానికి ఉన్న సంబంధం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా..? రక్తపోటు తగ్గిన తర్వాత, శరీర కార్యకలాపాలు మందగించడం ప్రారంభిస్తాయి. ఏయే విషయాల్లో శ్రద్ధ వహించాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. మొదటి ప్రశ్న ఏంటంటే బీపీ ఎందుకు తక్కువగా ఉంది.. అది తక్కువగా ఉన్నప్పుడు మనకు ఎందుకు తల తిరుగుతుంది? ఇలాంటి ప్రశ్నల గురించి మనం ముందుగా […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్.. ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో.. ఈ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. టీడీపీని ఇరుకున పెట్టేందుకు అధికార వైసీపీ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంటే.. చంద్రబాబు అరెస్ట్‌తో పాటు.. ప్రజా సమస్యలపై గళం విప్పాలని టీడీపీ నిర్ణయించింది. ఇవాళ ఉదయం 9 గంటలకు శాసనసభ,10 గంటలకు శాసనమండలి ప్రారంభంకానుంది. క్వశ్చన్ అవర్‌తో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభ వాయిదా తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. […]
ఏపీలో స్కిల్ స్కాం కేసు హీటెక్కిస్తుంది. తాజాగా సీఐడీ చీఫ్ చూపించిన సంతకాలు, చెబుతున్న రహస్యాలు.. టీడీపీని కలవరానికి గురిచేస్తున్నాయి. లోకేష్ పాత్రపై విచారణ చేస్తామడంపై ఆ పార్టీలో అలజడి నెలకొంది. బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లను దాఖలు చేశారు చంద్రబాబు తరపు లాయర్లు. వాటికి కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయనుంది సీఐడీ. దాంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసు సంచలనం సృష్టిస్తుంది. నిందితునిగా మాజీ సీఎం […]
స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. హైకోర్టు బుధవారం క్వాష్ పిటిషన్‌ను వాయిదా వేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం.. ఈ రోజు మా నినాదం ఇదే.. అంటూ గురు గోవింద్ సింగ్ సూక్తిని ఆయన ఉటంకించారు. ‘అన్ని విధాలుగా ప్రయత్నించినా న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది’ అని ట్వీట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో సీఐడీ […]
రాజేంద్రనగర్, న్యూస్‌లీడర్, ఆగస్టు 14: మెడికల్ షాప్‌కు వెళ్లి ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుద్వేల్‌లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్లకు చెందిన శ్రీనివాస్ (35) రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌కు వలస వచ్చాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం శ్రీనివాస్‌కు ఛాతీలో నొప్పిరావడంతో స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ పరీక్షించి అతడికి మందులు రాసిచ్చారు. […]
తిరుమల, న్యూస్‌లీడర్, ఆగస్టు 12: తిరుమలలో శ్రీవాణి దర్శనం టికెట్ల కోసం భక్తులు పోటెత్తారు. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కౌంటర్ ఉదయం 8.30 గంటలకు తెరుస్తారు. కేవలం 400 టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్ ధర రు.10,000, రు.500. అయినా వేలమంది ఈ టికెట్ల కోసం తిరుమల జేఈవో కార్యాలయం వద్ద ఎగబడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారిని దగ్గరగా కనులారా దర్శించుకోవాలన్న కోరిక గల భక్తులకు టీటీడీ శ్రీవాణి ట్రస్టుకు 10 […]
` యూపీలోని మీరట్ జిల్లా వైద్య కళాశాలలో ఘోరం ` ప్రసవం కోసం చేరిన మహిళల్లో హెచ్ఐవీ నిర్ధారణ ` కారణాలను గుర్తించేందుకు కమిటీ నియామకం లక్నో, న్యూస్‌లీడర్, ఆగస్టు 5 : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో హెచ్ఐవీ సోకిన గర్భిణుల కేసులు పెద్ద మొత్తంలో వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 16 నెలల కాలంలో 60కి పైగా గర్భిణులకు హెచ్ఐవీ ఉన్నట్టు ఇక్కడ గుర్తించారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు అసలేం […]
ఎర్రమట్టి దిబ్బలు కాపాడుకుంటాం వైసీపీ ప్రభుత్వం స్పందించకపోతే.. గ్రీన్ ట్రైబ్యునల్ వరకు వెళ్తాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 16: భీమునిపట్నం మండలంలో ఎర్ర దిబ్బలు చారిత్రార్తకమైనవని, ఎర్రమట్టి దిబ్బలు అరుదైన వారసత్వ సంపదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. భీమిలిలో ఎర్రమట్టి దిబ్బల వద్ద జరిగిన ప్రకృతి విధ్వంసాన్ని బుధవారం సాయంత్రం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 1200 ఎకరాల్లో ఉండే ఎర్రమట్టి దిబ్బలు […]
దేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖ విశాఖలో ‘ఇండియా విజన్ 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరణలో చంద్రబాబు విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 15: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విశాఖలో సద్భావన యాత్రలో పాల్గొన్నారు. ఆర్కే బీచ్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు త్రివర్ణ పతాకం చేతబూని ఉత్సాహంగా నడిచారు. విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘ఇండియా విజన్ 2047’ డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుపై […]
సహకరిస్తున్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రను దోపిడి చేస్తుంటే మాట్లాడేవారే లేరా? అనకాపల్లి జిల్లా విసన్నపేట భూ దోపిడిపై జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. వారాహి యాత్రలో భాగంగా విసన్నపేట భూములను పరిశీలించారు. తెలంగాణలో ఇదే తరహాలో దోపిడి చేస్తే తన్ని తరిమేశారని అన్నారు. ఉత్తరాంధ్రను దోపిడి చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు మాట్లాడకుండా దోపిడికి వంత పాడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లా యువతకు ఉపాధి లేదు. చదువుకున్నా ఉద్యోగాలు లేదు. ప్రధాన […]
. హవాయి ద్వీపంలో విషాదం మిగిల్చిన కార్చిచ్చు .ఎటు చూసినా కాలిన శవాలే.. . బూడిదైన హవాయి స్వర్గధామం . 67 మంది మృత్యువాత . పచ్చదనం కనుమరుగు లహైనా : హవాయి దీవులను కార్చిచ్చు నామరూపాలు లేకుండా చేసింది. కొన్ని రోజుల క్రితం వరకు పచ్చదనానికి ప్రతీకగా ఉన్న ఈ దీవులు ఇప్పుడు బూడిదమయంగా తయారయ్యాయి. ఇప్పటి వరకూ 67 మంది చనిపోయినట్టు సమాచారం. వేలాది ఇళ్లు భష్మీపటలమయ్యాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ పర్యాటక […]
` జోబైడెన్ తీవ్ర వ్యాఖ్యలు ` ఆ దేశ ఆర్థిక విధానాలపై ఆక్షేపణ వాషింగ్టన్ : చైనా ఆర్థిక విధానం, తద్వారా ఎదురయ్యే సమస్యలపై అమెరికా అధ్యక్షుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధిక జనాభా, ఆర్థిక సమస్యలు చైనాను ముంచడం ఖాయమన్నారు. చైనా ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న టైమ్బాంబులా ఉందంటూ జోబైడెన్ వ్యాఖ్యానించారు. ఆ దేశ పరిస్థితి గురించి మిగిలిన దేశాలు కూడా ఆందోళనగా ఎదురు చూస్తున్నాయన్నారు. యూటాలోని పార్క్ సిటీలో విరాళాల సేకరణలో పాల్గొన్న […]
. చంద్రయాన్ కంటే 2 రోజుల ముందే జాబిల్లిపై ల్యాండిరగ్ . దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ‘లూనా-25’ ప్రయోగం . శుక్రవారం తెల్లవారుజామున 2.00గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి నింగికెగసిన రాకెట్ . ఆగస్టు 21న చంద్రుడిపై దిగే అవకాశం మాస్కో : దాదాపు అర్ధశతాబ్దం క్రితం అంతరిక్ష రంగంలో అగ్రగామిగా వెలుగొందిన రష్యా మరోసారి తన సత్తా ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు చంద్రయాన్ తరహాలో తాజాగా ‘లూనా-25’ […]