పేర్ల నమోదుకు నిర్వాహకుల విజ్ఞప్తి…
విశాఖపట్నం, న్యూస్ లీడర్, ఆగష్టు 14: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వైజాగ్ రన్నర్స్ సొసైటీ వార్షిక సిటీ మారథాన్ ‘వైజాగ్ మారథాన్’ మొదటి ఎడిషన్ ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 5 కిలోమీటర్ల ప్రమోషనల్ రన్, అడ్మిరల్ ఆర్ విజయ్ శేఖర్ జెండా ఊపి ఆదివారం ప్రారంభించారు. ఈ రన్ నోవాటెల్ హోటల్ నుండి పార్క్ హోటల్ రోడ్డు వరకు జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 18న జరగనున్న వైజాగ్ మారథాన్ ప్రారంభ రన్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలని, వారి పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ పాల్గొనేందుకు వీలుగా ఈ పోటీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. 10 కిలోమీటర్లు (14 ఏళ్ళు అంతకంటే ఎక్కువ), 5 కిలోమీటర్లు (10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ), 3 కిలోమీటర్లు 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ బాలురు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వైజాగ్ రన్ లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేయబడునని ప్రకటించారు. క్రీడలను ప్రోత్సహించడం, పటిష్టమైన దేహ ధారుఢ్యాన్ని, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ రన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో అధ్యక్షుడు బాలకృష్ణ రాయ్, సెక్రటరీ శ్రీనివాస్ కంచెటి, వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ గాయత్రి కృష్ణ, ఏఎన్ రాజు, హర్మీందర్ సింగ్ గిల్, వివేక్ దాసాని, గరిష్ట కోర్, కమిటీ సభ్యులు సత్య గుంటూరు, మండవ రాజశేఖర్, జుల్ఫికర్ హైదరాబాద్ వాలా, షీలా అమృత్ రాజ్, వైజాగ్ రన్నర్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.