14అంశాల్లో 250మందికి పోటీలు
వివిధ రాష్ట్రాల నుంచి అతిథులు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్: సెంట్రల్ రెవెన్యూ, స్పోర్ట్స్, కల్చరల్ బోర్డు ఆధ్వర్యంలో విశాఖలో రెండ్రోజుల పాటు నిర్వహించిన సంబరాలు ముగిశాయి. ఆదాయపన్ను శాఖ, సెంట్రల్, ఎక్సైజ్, సీజీఎస్‌టీ, కస్టమ్స్ విభాగాలకు చెందిన సౌత్‌జోన్ ఉద్యోగులు బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో ఆనందంగా గడిపారు. ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ తదితర రాష్ట్రాల నుంచి సుమారు 250మంది కేంద్ర ఉద్యోగులు 14అంశాల్లో నిర్వహించిన వివిధ పోటీల్లో భాగస్వాములయ్యారు. ఈ సంబరాలకు ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి ఈ నెల 20న జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు.
21న విశాఖ జోన్ చీఫ్ కమిషనర్ (రెవెన్యూ) సంజయ్ పంత్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్‌ను కర్నాటక జోన్ కైవసం చేసుకుంది. ఉత్సవాల నిర్వాహణ బాధ్యతను విశాఖ సీజీఎస్‌టీ కమిషనర్ ఎం.ఆర్.ఆర్.రెడ్డి విజయవంతం చేయించారు. జాయింట్ కమిషనర్ మహ్మద్ అలీ, డెప్యూటీ కమిషనర్లు అవినాష్ కిరణ్ రొంగలి, శరత్ చంద్ర, శరవణకుమార్, సి. సత్యనారాయణ, ఎంకే శ్రీవత్సవ, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతల పేర్లనూ ఓ ప్రకటనలో తెలియజేశారు.