గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో బయో ఫార్మా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ డిజైన్
నాగపూర్, న్యూస్‌లీడర్: ఫార్మా ఇండస్ట్రీ, డిజిటల్ ట్రాన్స్‌ఫÛర్మేషన్ కోసం ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న గ్లోబల్ టెక్ సమ్మిట్ (జీటీఎస్)`2023 ఒక వేదిక కానుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. పల్సస్ గ్రూప్ సీఈవో డాక్టర్ శ్రీనుబాబు గేదెల నేతృత్వంలో ఈ సమ్మిట్ బృందం ఆదివారం నాగపూర్‌లో ఓ రోడ్‌షో నిర్వహించింది. అనంతరం ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో భాగంగా పాలసీ డిజైన్ సమావేశాలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా బిజినెస్-టు-బయోఫార్మా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి అక్కడివారు లోతుగా చర్చించారు. ఈ సదస్సులో 50మంది విధాన నిర్ణేతలు, గ్లోబల్ ఫార్మా నిపుణులు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొని ఔషధాల ఆవిష్కరణ, నియంత్రణ వ్యవహారాలు, వినియోగదారులకు అవసరమైన మందుల్ని అందుబాట్లోకి తీసుకువచ్చే సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు.
విప్లవాత్మకమే..
అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ డొమినిక్ జోర్డాన్ మాట్లాడుతూ, డ్రగ్స్ ఆవిష్కరణలో సాంకేతికత విప్లవాత్మకంగా మారిందని, ఫార్మాస్యూటికల్ రంగంలో డిజిటల్ పరివర్తన అనేది ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవల ఉత్పత్తి, సదుపాయాన్ని మెరుగుపరచడానికి వివిధ డిజిటల్ సాంకేతికతను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన ఔషధ అభివృద్ధి, రోగి సంరక్షణ వంటి అంశాల్లో ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు డిజిటల్ పరివర్తన ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. బయోఫార్మా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ చర్చల రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగా గుజరాత్ ప్రభుత్వ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ డా. హెచ్.జి.కోషియా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోంట్‌కుమార్ ఎం. పటేల్ పాల్గొన్నారు. డిజిటల్ హెల్త్‌కేర్ విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్లను మెడికల్ డివైస్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ అభిజిత్ ఘోష్ వివరించారు. కంట్రోలింగ్ లైసెన్సర్ అథారిటీ మాజీ బాధ్యుడు, ఇండియన్ ఫార్మా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన డాక్టర్ అతుల్ నాసా కూడా చర్చలో పాల్గొన్నారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ నారాయణ, ఫార్మా టైమ్స్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ అల్కా ముక్నేలు మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమ, విద్యారంగ ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. గ్లోబల్ టెక్ సమ్మిట్‌లో బయోఫార్మా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ డిజైన్ చేయాలని వారంతా అంగీకరించారు.
ఈ సమావేశంలో కొరియా కొంకాక్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ సుశ్రుత కొప్పుల, హెటెరో డ్రగ్స్ గ్లోబల్ ఫార్మాకోవిజిలెన్స్ నుంచి డాక్టర్ శ్రీధర్ రెడ్డి, గ్లెన్ మార్క్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ నుంచి రాహుల్ అరవింద్ లాడ్, అమిటీ వర్సిటీ నుంచి డాక్టర్ ఆర్తి ఆర్ ఠక్కర్, అల్ అమీన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి డాక్టర్ ఎండీ సలావుద్దీన్, విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ నుంచి డాక్టర్ ఏ రమేష్, రాఘవేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ నుంచి డాక్టర్ వై పద్మనాభరెడ్డి, వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ అంబాసిడర్ చక్రవర్తి ఏవీపీఎస్, తైజో జినోప్‌ా బయోటెక్నాలజీ కో లిమిటెడ్ చైనా సీఈవో డాక్టర్ రాజ్ కుమార్ ధర్, సిస్టోపిక్ లేబరేటరీస్ నుంచి శ్రీకుమార్, గుజరాత్‌లోని ఎల్‌ఎం కాలేజ్ ఆఫ్ ఫార్మశీ నుంచి డాక్టర్ మహేష్, ఇంటర్నేషనల్ ఫార్మస్యూటికల్ ఫెడరేషన్ నుంచి డాక్టర్ మంజరి ఘరథ్, ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు డాక్టర్ రావు వడ్లమూడి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ మహేంద్ర పటేల్ తదితరులు హాజరయ్యారు.