అచ్యుతాపురం, న్యూస్ లీడర్ మండల కేంద్రంలోపూడుమడక అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను రీజనల్ జాయింట్ డైరెక్టర్ యం. జ్యోతి కుమారి, ఉప విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ సోమవారం సాయంత్రం అకస్మికంగా ప్రభుత్వ నిబంధన ప్రకారం తనిఖీలు చేశారు. విద్యార్ధులకు బోధన చేసిన రికార్డులను పరిశీలించి, అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులు వర్క్ పుస్తకాలను సక్రమంగా హెచ్ఎం తనిఖీలు చెయ్యలేదని విషయాల వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం విద్యార్థులపై ఉన్నత ఫలితాలు తీసుకురావాలని నిబంధనలు ఉన్నప్పటికీ తూతూ మంత్రంగా ఉపాధ్యాయులు ప్రవర్తిస్తున్నారు. విద్యార్ధులకు తక్కువ గ్రేడింగ్ నమోదు కావడంతో భావితరాలకు భవిష్యత్తు ఉండదని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయులు పైనే ఉందని ప్రశ్నించారు. మండల విద్యాశాఖాధికారి సి.ఆర్.కె దేవరాయల్ సి.ఆర్.పిలు తదితరులు ఉన్నారు.