కార్గిల్, న్యూస్‌లీడర్, జూలై 04 : లడఖ్‌లో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.7గా నమోదైందని నేషనల్ సిస్మాలజీ సెంటర్ వెల్లడిరచింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం 7.38 గంటల సమయంలో లడఖలోని కార్గిల్ జిల్లాకు ఉత్తరాన 401 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు వెల్లడిరచారు. హిమాలయ ప్రాంతంలో సంభవించిన భూకంపం వెడల్పు 38.12 డిగ్రీలు, పొడవు 76.82 డిగ్రీలు, 150 లోతులో ఈ భూకంపం సంభవించిందని సిస్మాలజీ సెంటర్ వెల్లడిరచింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన సమాచారం లేదని అధికారులు పేర్కొన్నారు.