సింహాచలం, న్యూస్ లీడర్, జూలై ; శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయ హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. 14 రోజులకు నగదు రూపంలో రూ.2 కోట్ల 5 లక్షల72 వేల 705 రూపాయాలు, ముడుపులు,మొక్కుబడులు రూపంలో 100 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 13 కేజీల 500గ్రాములు వెండి భక్తులు హుండీ ద్వారా సమర్పించారు. 14 రోజుల్లో హుండీల ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం దేవస్థానం చరిత్రలో ఇదే ప్రథమం. ఈఓ వి. త్రినాధ రావు, దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో దేవస్థానం సిబ్బంది, సేవా ప్రతినిధులు ఆదాయం లెక్కింపులో భాగస్వాములయ్యారు.