మౌనిరాయ్ పరిచయం అవసరం లేదు. కేజీఎఫ్ చిత్రంలో ఐటమ్ నంబర్ తో అదరగొట్టిన ఈ బ్యూటీని సౌత్ అభిమానులు సులువుగా గుర్తుపట్టగలరు. ముఖ్యంగా ఇన్ స్టా ఫాలోవర్స్ ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ ఇచ్చే ట్రీట్ కి మైండ్ బ్లాంక్ అంటూ కామెంట్లతో విరుచుకుపడడం చాలా రొటీన్. తన తాజా ఫోటోలతో మౌని మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది. మౌని రాయ్ అందాల ప్రదర్శనకు సోషల్ మీడియాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి. చీరందంలో మజా ఎలా ఉంటుందో మౌని మరోసారి తాజా ఫోటోషూట్ తో రివీల్ చేసింది. ఈ ఫోటోషూట్ వీక్షించాక.. దారి తప్పి నేలపైకి వచ్చిన మత్స్యకన్యవా? అంటూ అభిమానులు లవ్ ఈమోజీలతో విరుచుకుపడుతున్నారు. మౌని చిలుకాకుపచ్చ మిరుమిట్ల చీరలో పాక్షికంగా అందాలను ఆరబోస్తున్న తీరు హృదయాలను గెలుచుకుంది. శిల్పి ఉలి వేసి చెక్కిన అందమైన విగ్రహకన్యలా కనిపస్తున్నావంటూ కొందరు అభిమానులు ప్రశంసిస్తున్నారు.మౌని రాయ్ అన్ లిమిటెడ్ ట్రీట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల దిశా పటానీతో కలిసి పింక్ లుక్ లో ఈ బ్యూటీ విస్మయపరిచింది. అభిమానుల్లోకి ఈ ఫోటోలు వేగంగా దూసుకెళ్లాయి. ఇప్పుడు అంతకుమించి తాజా ఫోటోషూట్ వైరల్ అవుతోంది. చిలుకాకు పచ్చ చీరలో మౌని అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో చర్చనీయాంశంగా మారాయి. ఏక్తా కపూర్ క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది మౌని. నాగిన్ లో నటించిన తర్వాత ఎంతో పాపులరైంది. మౌని 2018లో అక్షయ్ కుమార్ గోల్డ్ చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. గత సంవత్సరం అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్రలో కనిపించింది. ఇటీవల జుబిన్ నౌటియాల్ తో కలిసి ‘డోటరా’ అనే మ్యూజిక్ వీడియోలో కూడా కనిపించింది. ప్రస్తుత కెరీర్ మ్యాటర్ కి వస్తే.. తదుపరి సైన్స్ ఫిక్షన్ హార్రర్ కామెడీ చిత్రం ‘ది వర్జిన్ ట్రీ’లో సంజయ్ దత్- పాలక్ తివారీ- సన్నీ సింగ్ లతో కలిసి స్క్రీన్ స్పేస్ ను షేర్ చేసుకుంటోంది. సౌత్ లోను మౌని అవకాశాల కోసం ప్రయత్నిస్తోందని సమాచారం.