కరోనా సంక్షోభ సమయం నుంచి ఓటీటీ క్రేజ్ పెరుగుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఓటీటీ మార్కెట్లో వాటా పెంచుకునేందుకు ఓటీటీ వేదికలు వివిధ రకాల ఆఫర్లు, ప్రకటనలు చేస్తుంటాయి. అమెజాన్ ప్రైమ్ అదే పని చేస్తోంది.
ఎంటర్టైన్మెంట్కు సరికొత్త వేదికగా ఓటీటీ ఆవిర్భవించింది. వివిధ రకాల కంటెంట్లు, కొత్త కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అన్ని భాషల్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో పోటీ తట్టుకునేందుకు వివిధ ఓటీటీ వేదికలు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ యువతను ఆకట్టుకునేందుకు కొత్తగా యూత్ ఆఫర్ ప్రకటించింది.
ప్రస్తుతం థియేటర్లతో సమానంగా భారీ బడ్జెట్ సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయంటే వాటికున్న క్రేజ్, డిమాండ్ ఏపాటిదో అర్ధమౌతుంది. ప్రస్తుతం మార్కెట్లో సోనీలివ్, ఆహా, జీ 5, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ వేదికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ మరింత పెంచుకునేందుకు, కొత్త యూజర్లను ఆకట్టుుకునేందుకు అమెజాన్ ప్రైమ్ సరికొత్త ఆఫర్ అందిస్తోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో కొత్తగా 18-24 ఏళ్ల వయస్సు యువతకు అమెజాన్ యూత్ ఆఫర్ ప్రారంభించింది. ఈ ఆఫర్లో భాగంగా సబ్‌స్క్రిప్షన్‌ను 50 శాతం తగ్గించేసింది అమెజాన్. అమెజాన్ ప్రైమ్ నెల సబ్స్క్రిప్షన్ 299 రూపాయలు కాగా యువతకు మాత్రం 150 రూపాయలు క్యాష్‌బ్యాక్ రూపంలో వెనక్కి ఇస్తుంది. ఇక ఏడాది ప్లాన్ 1499 రూపాయలు కాగా క్యాష్ బ్యాక్ రూపంలో 750 రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి. 50 శాతం క్యాష్‌బ్యాక్ నగదును నేరుగా మీ బ్యాంక్ ఎక్కౌంట్లకు కాకుండా అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా అమెజాన్ యాప్ ఓపెన్ చేశాక అందులో యూత్ ఆఫర్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ప్రైమ్ మెంబర్షిప్ ప్లాన్ కొనుగోలు చేసేటప్పుడు మీ వయస్సును ధృవీకరించాలి.
అంతే మీరు ఎంచుకున్న ప్లాన్ డబ్బులు చెల్లించిన తరువాత క్యాష్‌బ్యాక్ రూపంలో అందులోంచి 50 శాతం క్యాష్‌బ్యాక్ రూపంలో అమెజాన్ పే బ్యాలెన్స్ ఎక్కౌంట్‌కు చేరుతుంది.