అడ్వాన్సింగ్ అఫర్డ్‌బుల్ హెల్త్‌కేర్, టెక్నాలజీకి ఊతం
అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖుల్ని ఒకే వేదిక మీదకు తీసుకు రావడమే లక్ష్యం
జీ`20 దేశాల సదస్సులకు అనేక అంశాల వెల్లడి
అమరావతి, నూస్లీడర్, జూలై 4: ఈ నెల 3, 4వ తేదీల్లో ఫ్రాన్స్ దేశపు రాజధాని పారిస్‌లో నిర్వహించిన గ్లోబల్ టెక్ 20`సమ్మిట్ 2023 విజయవంతమైంది. అదే విధంగా గత నెల 28నుంచి రెండ్రోజుల పాటు లండన్‌లోనూ సదస్సు నిర్వహించగా అడ్వాన్స్డ్ అఫర్డబుల్ హెల్త్ కేర్, టెక్నాలజీలో అద్భుతమైన స్పందన కనిపించిందని సమ్మిట్ కో`కన్వీనర్, పల్సస్ గ్రూప్స్ సీఈవో శ్రీనుబాబు గేదెల ఓ ప్రకటనలో తెలిపారు. జీ`20సదస్సుల సందర్భంగా త్వరలో జరగనున్న గ్లోబల్ ఫార్మా 20, గ్లోబల్ హెల్త్ 20 సదస్సులకు ఇవి ఊతమిచ్చాయని ఆయన స్పష్టం చేశారు. పారిస్, లండన్‌లో జరిగిన సదస్సుల్లో మేధావులతో పాటు సైంటిస్టులు, ఫిజీషియన్లు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడిరచారన్నారు. వారు అందజేసిన నివేదికలు, ప్రాజెక్టులు త్వరలో న్యూఢల్లీి, హైదరాబాద్, విశాఖలో జరగనున్న సదస్సుల్లో ప్రదర్శిస్తామని, విజేతలకు అవార్డులు కూడా అందజేస్తామని శ్రీనుబాబు గేదెల తెలిపారు. అదే విధంగా పారిస్‌లో జరిగిన సదస్సు ఎన్నో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచిందన్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆక్టోవియన్ బుకర్, సదరన్ న్యూ హ్యాంపిషైర్ యూనివర్శిటీ నుంచి పెసీ అమెరియా తదితరులు హాజరై తమ అభిప్రాయాల్ని వెల్లడిరచారు.
హాజరైన ప్రముఖులు
పారిస్, లండన్లలో జరిగిన సదస్సుల ముఖ్యోద్దేశాన్ని అక్కడి ప్రముఖులంతా విన్నారని శ్రీనుబాబు తెలిపారు. అదే విధంగా కెనడాలోని హంబేర్ రివర్ హెల్త్ సంస్థకు చెందిన జాన్వీ సోలాంకీ, ఇజ్రాయిల్‌లోని గొతే యూనివర్శిటీకి చెందిన మహ్మద్ ఘనీయం తదితరులు టెక్నాలజీ, హెల్త్‌కేర్ అంశాల్లో అనేక విషయాల్ని ప్రదర్శించారు. వాల్స్ మెడికల్ మీడియా (అమెరికా), కాన్ఫరెన్స్ సిరీస్ (యూకే), యూరోపియన్ బయో టెక్నాలజీ, థెమటిక్ నెట్వర్క్ అసోసియేషన్, వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తలసీమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ సంస్థలు పూర్తి స్థాయిలో సహకరించాయని శ్రీనుబాబు గేదెల ఓ ప్రకటనలో వెల్లడిరచారు. గ్లోబల్ టెక్ సదస్సుల పూర్తి వివరాల్ని వెబ్సైట్లో తెలుసుకోవచ్చని, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులందర్నీ ఒకే వేదిక మీదకు తీసుకురావడమే ఈ సదస్సు లక్ష్యమని శ్రీనుబాబు పేర్కొన్నారు.