ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు ఖాయమని, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. దిల్లీ పర్యటనలో ప్రధానితో ఇదే అంశంపై మాట్లాడినట్లు తెలిసిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం రాత్రి ఈ మేరకు వీడియో విడుదల చేశారు. ‘ఎన్డీయేలో చేరడానికి ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయితే తెలంగాణతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లటానికి సూత్రప్రాయంగా పెద్దలు అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో ప్రతిపక్షాలను తప్పుదోవ పట్టించడానికి ఎంపీ మిథున్‌రెడ్డి వాటిని ఖండించారు. టీవీ ఛానళ్లకు లీకులు వాళ్లే ఇచ్చారు. మళ్లీ వాటిని నమ్మొద్దని వాళ్లే ప్రకటనలు చేశారు. దానివల్ల ప్రతిపక్షాలు సీరియస్‌గా తీసుకోకుండా ఎన్నికలకు సమాయత్తం కావన్నది వారి భావన. నిజాన్ని అతిపొదుపుగా వాడే వ్యక్తుల్లో జగన్ ఒకరు. ఆయన చెప్పే పని ఏదీ చేయరు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల్లేవని చెప్పారంటే కచ్చితంగా ఉన్నట్లే భావించాలి. అందువల్ల ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు సిద్ధమవ్వాలి. ఒకటి రెండురోజుల్లో దీనిపై అదనపు సమాచారం బయటికొస్తుంది’ అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.