బెంగళూరు, జూలై 6 : దేశంలో టమాటా ధరలు వింటే నో‘టమాటా’గా పరిస్థితి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కిలో టమాటా ధర ఎప్పుడు రూ.100 దాటేసింది. ఈ నేపథ్యంలో టమాటాను మహిళలు చాలా పొదుపుగా వాడుకొంటున్నారు. చాలా మంది అయితే టమాటాలు లేకుండానే వంట కానిచ్చెస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమంత్రి.. ఇలా అనేక ప్రాంతాల్లో టమాటా ధర చుక్కలను అంటుతోంది. చాలా ప్రాంతాల్లో ఎప్పుడో సెంచరీ కొట్టేసిన టమాటా ఇప్పుడు నగరాల్లో 150పైనే పలుకుతోంది. దీంతో టమాటాలవైపు చూసేందుకు భయపడుతున్న జనం ప్రత్యామ్నాయాలవైపు చూస్తున్నారు. టమాటా ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇదే మంచి సందు అనుకున్నారో, ఏమో కానీ, దొంగల దృష్టి ఇప్పుడు అటువైపు పడిరది.
కర్ణాటకలో ఓ రైతు రెండెకరాల్లో పండిరచిన టమాటాలను చోరులు ఎంచక్కా కోసుకెళ్లిపోయారు. వాటి విలువ రూ. 2.5 లక్షల పైమాటేనని బాధిత మహిళా రైతు ధరణి వాపోయింది. పంటను కోసి బెంగళూరు మార్కెట్కు తరలించాలని అనుకున్నామని, అంతలోనే దొంగలు మొత్తం దోచుకుపోయారని పేర్కొంది. ప్రస్తుతం బెంగళూరులో కిలో టమాటా రూ. 120కిపైనే పలుకుతోంది. టమాటాలతో పాటు మిగతా పంటను కూడా ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. టమాటాల చోరీపై హలెబీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.