యాదాద్రి, న్యూస్‌లీడర్, జూలై 7 : హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య శుక్రవారం ఉదయం జరిగింది. రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వస్తున్నట్లు గమనించిన సిబ్బంది అప్రమత్తమై రైలును నిలిపివేశారు. మంటలు చెలరేగిన ఆ రెండు బోగీల్లోని ప్రయాణికులను కిందికి దించివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మంటల ధాటికి రెండు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మిగతా బోగీలకు కూడా మంటలు వ్యాపిస్తున్నాయి. రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ సంఘటన స్థలికి బయల్దేరారు. రైల్వే పోలీసులు, సిబ్బంది మంటలను అదుపు చేశారు.