వరంగల్, న్యూస్లీడర్, జూలై 9 : కేంద్రం ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శనివారం వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు రూ.లక్షా పదివేల కోట్ల ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయ్యాక జాతీయ రహదారులు మెరుగయ్యా యన్నారు. రాష్ట్రం కోసం కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టినట్టు పేర్కొన్నారు. అలాగే రూ.1900 కోట్లతో హైదరాబాద్-వరంగల్ రహదారిని మంజూరు చేసినట్టు తెలిపారు. అభివృద్ధిలో భాంగా శనివారం రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారని తెలిపారు. దీని ద్వారా 3 వేల ఉద్యోగాలు వస్తాయని అని కిషన్రెడ్డి అన్నారు.