ద్విచక్ర వాహనాలు అపహరించి తప్పించుకు తిరగడమే కాకుండా.. పోలీసు కానిస్టేబుల్‌పై బ్లేడ్‌తో దాడిచేసిన నిందితుడిని కుల్సుంపురా పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ అశోక్‌కుమార్, ఎస్సై మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన ఏకేందర్(19) తొమ్మిదేళ్ల క్రితం నగరానికి వలసొచ్చి.. స్నేహితులతో కలిసి నాంపల్లిలో అద్దెకుంటున్నారు.
వ్యసనానికి బానిసైన యువకుడు సులువుగా డబ్బులు సంపాదించి జల్సాలు చేయొచ్చని భావించి.. కొంతకాలంగా వాహనాలను అపహరిస్తున్నాడు. శుక్రవారం యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి తాను తస్కరించిన రెండు ద్విచక్ర వాహనాలపై జియాగూడ కబేళా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా.. అదే సమయంలో పెట్రోలింగ్‌లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ రవీందర్, కానిస్టేబుల్ ఉదయ్, పెట్రోకార్ డ్రైవర్ శ్రీకాంత్‌లు కలిసి వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. వారు పారిపోతుండగా కానిస్టేబుల్ ఉదయ్ ఏకేందర్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
యువకుడు తన జేబులో ఉన్న స్టేషనరీ బ్లేడ్‌తో కానిస్టేబుల్‌పై దాడిచేయగా కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన హెడ్‌కానిస్టేబుల్, డ్రైవర్ అతికష్టం మీద యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన నేరాల చిట్టా విప్పాడు. మేడిపల్లి, పటాన్‌చెరులోని ఇస్నాపూర్ ప్రాంతాల్లో రెండు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు చెప్పాడు.