వరంగల్, న్యూస్ లీడర్, జూలై 8Ñ దేశాభివృద్ధిలో తెలుగోడి పాత్ర కీలకంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ పర్యటనకు శనివారం వచ్చిన ప్రధాని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పసభ వేదికగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు.
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయింది. రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాం. అనేక కారిడార్లను పూర్తి చేసుకుంటున్నాం. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్-ఎకనామిక్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయి. కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుంది. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నాం. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నాం’’ అని ప్రధాని మోదీ అన్నారు.
తెలంగాణాకు శుభ సూచకం: ఈటల
వరంగల్ గడ్డమీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి శ్రీకారం చుట్టిన ఇవాళ తెలంగాణ జిల్లాలకు శుభ సూచికమని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణకు భరోసాగా ఉన్నామని చెప్పేందుకే ప్రధాని వచ్చారన్నారు. కేసీఆర్‌ను గద్దెదించాలని ప్రజలు కోరుకుంటున్నారు. హామీలు ఇచ్చి ప్రజల కళ్లలో మట్టికొట్టిన కేసీఆర్‌ను ఓడిరచాలి. బంగారు తెలంగాణ పేరిట కేసీఆర్ మాటలు చెప్పారు. బంగారు తెలంగాణ చేతల్లో చేసే చూపించే సత్తా భాజపాకే ఉంది.’’ అని ఈటల తెలిపారు.
నీ మొహంతో ఇంత ప్రగతి చూశారా: బండి
‘ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని నరేంద్ర మోదీ’ అని తెలంగాణ భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రూ.6 వేల కోట్ల పనులు ప్రారంభించిన మోడీకి కరీంనగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు. ఏం ముఖం పెట్టుకొని ప్రధాని మోడీ వస్తారని కొందరు ప్రశ్నించారు. 10 వేల మంది వరకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని మోడీ వచ్చారు. వరంగల్‌ను స్మార్ట్ సిటీ చేసేందుకు మోడీ వచ్చారు. ప్రధాని కార్యక్రమానికి వచ్చేందుకు కేసీఆర్‌కు ముఖం లేదు. మోడీ వస్తే కేసీఆర్‌కు కొవిడ్ వస్తుంది.. జ్వరం వస్తుంది’ అని బండి సంజయ్ విమర్శించారు. పార్టీ తనకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సహా అనేక అవకాశాలు కల్పించిందని ఆయన అన్నారు.