ఢిల్లీ, న్యూస్లీడర్, జూలై 8 : వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. వైఎస్సార్ తన చివరి శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేశారు. ప్రజలంటే ఎనలేని ప్రేమ కలిగిన నాయకుడు వైఎస్సార్. ప్రజలు, కాంగ్రెస్కు ఆయన చేసిన కృషి ఎప్పటికీ మరవలేనిది అంటూ ఖర్గే ట్వీట్ చేశారు.