ఖమ్మం, న్యూస్లీడర్, జూలై 10 : వ్యాయామశాలకు వెళ్లి వచ్చిన తర్వాత గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఖమ్మం నగరంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. బాలపేటకు చెందిన శ్రీధర్ (31) వ్యాయామం చేసి ఇంటికి వచ్చిన కొద్ది సేపటికి తీవ్ర అస్వస్థతకు గురైయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఆయన గతంలో జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందారు. మృతుడి తండ్రి మానుకొండ రాధాకిశోర్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీి మాజీ ఛైర్మన్గా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ నాయకుడుగా ఉండేవారు. శ్రీధర్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఖమ్మం నగరంలోని అల్లిపురంలో ఆదివారం ఉదయం నాగరాజు (33) అనే యువకుడు కూడా ఇలాగే గుండెపోటుతో మృతి చెందాడు.