తిరుమల, న్యూస్ లీడర్, జూలై 10 ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం కూడా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి క్యూ లైన్లలో ప్రవేశించినవారు సోమవారం ఉదయానికి కూడా దర్శనం కోసం వేచిచూస్తున్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి, క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. ఆదివారం తిరుమల వెంకన్నను 88,836 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,231 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే సమయంలో శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.69 కోట్ల ఆదాయం లభించింది.