సికింద్రాబాద్, న్యూస్ లీడర్, జూలై 10 ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. హైదరాబాద్లోని రైల్వే సంచాలన్భవన్లో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది నుంచి వివరాలను సేకరిస్తోంది. ప్రమాదంపై రైల్వే అధికారులు రెండు రోజులపాటు వివరాలు సేకరించనున్నారు. ప్రమాదమా? కుట్రా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో సామగ్రి కోల్పోయిన ప్రయాణికుల వివరాలు సేకరిస్తున్నారు. గుంటూరు డివిజన్ పరిధిలో ఘటన దృష్ట్యా అక్కడి సిబ్బంది విచారిస్తున్నారు.