ఆంటిగ్వా, న్యూస్లీడర్, జూలై 11: ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో సోమవారం రాత్రి 8.28 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ట్వీట్ ద్వారా తెలిపింది. అట్లాంటిక్ సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. 6.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన తర్వాత ఏజెన్సీ ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ఇప్పటికిప్పుడు సునామీ వచ్చే ప్రమాదం లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు.. మంగళవారం తెల్లవారుజామున 2.28 గంటల సమయంలో ఆంటిగ్వా, బార్బుడాలో కూడా భారీ భూకంపం వచ్చింది. భూమి కంపించిందని అధికారులు వెల్లడిరచారు. భూకంప తీవ్రత 6.6గా నమోదయిందని, కాడ్రిరగ్టన్కు 274 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు.
అంతకుముందు జూన్ 16న, సెంట్రల్ మెక్సికో తీరంలో రాత్రి 2 గంటల సమయంలో తీవ్రమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.3గా నమోదైంది. ఈ సమయంలో కూడా భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల దిగువన కనుగొనబడిరది. భూకంపం రావడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం చాలా బలంగా ఉంది. తక్కువ జనాభా ఉన్న ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతంలోని కొన్ని ఇతర పట్టణాలలో చిన్న ప్రకంపనలు సంభవించాయి. కాలిఫోర్నియాలో భూకంపాలు కొత్తేమీ కాదు. అమెరికాలోని ఈ రాష్ట్రంలో నిత్యం భూకంపాలు వస్తూనే ఉంటాయి.