బుట్టాయగూడెం, న్యూస్లీడర్, జూలై 11 : ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో దారుణం చోటుచేసుకుంది. పులిరామన్నగూడెంలోని గిరిజన సంక్షేమశాఖ వసతిగృహంలో ఉంటూ చదువుకుంటున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్ (9)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది. అసలు బాలుడిని ఎవరు, ఎందుకు చంపారోనన్న విషయం తెలియలేదు. వసతిగృహ సిబ్బంది విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న బుట్టాయగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.