అమరావతి, న్యూస్ లీడర్, జూలై 12Ñ ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశానికి మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఢల్లీిలో ఉండటంతో ఈ సమావేశంలో పాల్గొనలేదు. కడప జిల్లా వేంపల్లె మండలంలో 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. 8,104 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్టు పెట్టనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ రూ. 2450 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనతో నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల, కడప జిల్లాలో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తిరుపతి పేరూరు వద్ద రూ.218 కోట్లతో హయత్ ఇంటర్నేషనల్ హోటల్‌కు ఆమోదం తెలిపింది. తిరుపతి జిల్లా వరదాయపాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్ పుడ్, బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో ఎడిబుల్ ఆయిల్ తయారీ ఫ్యాక్టరీ, తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదన పై కూడా ఆమోదం లభించినట్టు తెలిసింది.
విశాఖకు…
విశాఖ జిల్లా అన్నవరంలో మే ఫెయిర్ హెటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు, అచ్యుతాపురం వద్ద హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పై కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.