అరకులోయ, న్యూస్లీడర్ జూలై 12: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ నియోజకవర్గం మండల కేంద్రం అరకులోయ పట్టణ నడిబొడ్డున (రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి అధ్వానంగా తయారయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారిలో ప్రయాణం చేయాలంటే నరకం అంటూ బీజేపీ అరకు పార్లమెంట్ ఇంచార్జి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, అరకు నియోజకవర్గ నాయకుడు పాంగి రాజారావు ఆధ్వర్యంలో వారి కార్యకర్తలతో కలిసి ఈ రహదారిని సందర్శించారు. పొల్లన్ని తలపిస్తున్న ఈ రోడ్డుని చూసి ఆమె చలించిపోయి వరి నాటుకునే విధంగా ఉండడం చూసి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ రహదారి ఐటీడీఏ గోస్తని ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఆంధ్ర ప్రదేశ్ టూరిజం గెస్ట్ హౌస్ లకు వెళ్ళే ప్రధాన రహదారి అయినప్పటికైనా పాలకులకు పట్టదా అంటూ ఆమె విమర్శలు గురిపంచారు. అలాగే తరచుగా ప్రభుత్వ అధికారులు నాయకులు వెళ్లే ఈ రహదారిని చూడలేదా ? ఇంత దారుణం అంటూ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో వెనక పడిపోయిందంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అరుకు మండల బిజెపి అధ్యక్షుడు స్వాబి రామచందర్. బిజెపి నాయకులు కిల్లో ఆనంద్. అరుకు నియోజకవర్గంలో ఉన్న మండల నుండి గెలుపొందిన ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు