విజయవాడ, న్యూస్ లీడర్, జూలైó 13 వలంటీర్లపై జనసేన అధినేత చేసిన ఆరోపణలుపై విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మహిళల అక్రమ రవాణాలకు కొందరు వలంటీర్లు సహకరిస్తున్నారంటూ పవన్ ఏలూరు వారాహి యాత్రలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై పవన్ పై సురేశ్ అనే వలంటీర్ కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 405 / 2023 కింద సురేశ్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు పవన్ పై ఐసీపీ 153, 153 ఏ, 502 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.