పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – మెగా యంగ్ హీరో సాయితేజ్ కలిసి నటించిన ‘బ్రో’ రిలీజ్ డేట్‌కు దగ్గరపడుతోంది. అయినా ఈ సినిమా పై భారీ స్థాయి లో బజ్ క్రియేట్ అయినట్టు కనపడట్లేదు. వాస్తవానికి పవన్ సినిమా అంటే అనౌన్స్ చేసినప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు.. లేదంటే కనీసం రిలీజ్‌కు నెల రోజుల ముందు నుంచే భారీగా సందడి వాతావరణం నెలకొంటుంది. సోషల్ మీడియా అంతా సాంగ్స్ టీజర్స్‌తో ఫ్యాన్స్ రచ్చ లేపుతుంటారు. కానీ ‘బ్రో’కు ఆ పరిస్థితి కనపడట్లేదనిపిస్తోంది! కేవలం ఏదైనా అప్డేట్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఆ కాసేపు హడవుడి ఉంటోంది. తర్వాత అంతా సైలెంట్‌గా కనపడుతోంది.అసలీ ఈ సినిమా ను పవన్ జెట్ స్పీడ్‌లో 20 – 25 రోజల కాల్షీట్లు ఇచ్చి వేగంగా పూర్తి చేశారు. మేకర్స్ కూడా అంతే స్పీడ్‌గా మొత్తం సినిమా షూట్‌ను పూర్తి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ స్పీడ్ కాస్త తగ్గినట్టైంది. రిలీజ్‌కు ఇంకా 20 రోజులు కూడా లేదు.. ప్రమోషన్స్ విషయం లో మూవీటీమ్ కాస్త నత్తనడక చూపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. పవన్ – సాయికి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ఇంకా పెండిరగ్‌లోనే ఉందని తెలి సింది. వారు వీలైనంత త్వరగా ఈ వారం లో దీన్ని పూర్తి చేసి సినిమాను ముందుకు తీసుకె ళ్లాల్సిన బాధ్యత ఉంది.అయితే పవన్ ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించిన వారాహి విజయ యాత్రలో ఫుల్ బిజీ గా ఉన్నారు. ఇరి ఇలాంటి సమయంలో ఆయన తన డబ్బింగ్ పనులను ఈ వారం లో పూర్తి చేస్తారా అనేది సందేహమే. ఏదేమైనప్పటికీ ఈ డబ్బింగ్ పనులు పూర్తవ్వడానికి మరో వారం పటొచ్చని తెలుస్తోంది. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయాని కొస్తే.. ఇంకా లొకేషన్ డేట్ అండ్ టైమ్ కూడా ఫిక్స్ చేయలేదు. ఈ ఫంక్షన్‌కు పవన్ హాజరైతే.. భారీ స్థాయి లో అభిమానులు తరలివస్తారన్న సంగతి తెలిసిందే. కాబట్టి.. ముందుగానే దీని కోసం సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేలా ఎటువంటి ప్లాన్ చేస్తున్నారో ఇంకా ఎటువంటి సమాచారం తెలియలేదు. లేదంటే ఈవెంట్ సమయం లో అభిమానుల ను కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి అన్నింటినీ పరిగణ లోకి తీసుకుని సీజీ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ పనలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.