శ్రీహరికోట, న్యూస్ లీడర్, జూలై 13 జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ 3 శుక్రవారం నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం నుంచే కౌంట్‌డౌన్ మొదలైంది. చంద్రయాన్-3 ప్రయోగానికి తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) సిద్ధమైంది. ఈ ప్రయోగానికి గురువారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం-3పీ4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది..