విశాఖపట్నం, న్యూస్లీడర్, జూలై 13: నాటి గంగవరం పోర్ట్కు వేల ఎకరాల ఉక్కు భూములను దారాదత్తం చేసిన ప్రతిష్టాత్మక విశాఖ స్టీలుప్లాంట్ నేడు ఆదాని పోర్ట్ వలలో చిక్కుకుని గిలగిల్లాడుతుంది. బొగ్గు కుత్రిమ కొరతతో కొత్త సమస్యలు సృష్టించి ఉక్కుపాదం మోపేందుకు ఆదాని(గంగవరం)పోర్ట్ వ్వూహాంలో ఇప్పుడు విశాఖ ఉక్కు చిక్కుకుంది. ఒక వైవు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ఓడలు గంగవరం పోర్ట్లో లంగరేసుకుని కూర్చున్నాయి. అయితే ఆదాని పోర్ట్ తమ పాత బకాయిలు చెల్లిస్తే తప్ప బొగ్గును ఉక్కుకు చేరనివ్వమని హుకుం జారి చేసింది. దీంతో ఉక్కులో రోజురోజుకీ బొగ్గునిల్వలు నిండుకుంటున్నాయి. తదానుగుణంగా ఉక్కు ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తుంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే ఉక్కుకు చిక్కులు తప్పవన్న సంకేతాలు అటు కార్మిక, ఇటు యాజమాన్య వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
గంగవరం పోర్ట్ ఏర్పాటు కోసం ఉక్కు మిగులు భూములు 11వందల ఎకరాలు విశాఖ ఉక్కు నాటి గంగవరం పోర్ట్కు ధారదత్తం చేసింది. ప్రభుత్వ, ప్రవేటు భాగస్వామ్యంలో ఒక లోతైన పోర్ట్ ఉక్కుకు సమీపంలో ఏర్పాటైతే ఉక్కు ఉత్పత్తులు, ముడి సరుకు దిగుమతిఎగుమతులకు సౌకర్యవంతంగా ఉంటుందని నాటి ఉక్కు యాజమాన్యం భావించింది. అయితే ఇటీవల ప్రభుత్వ భాగస్వామ్యాన్ని పూర్తిగా వదులు కోవడంతో గంగవరం పోర్ట్ కాస్త ఆదాని పోర్గ్గా మారిపోయింది. ఆదాని పోర్ట్కు విశాఖ ఉక్కు కార్గో హేండ్లింగ్ చార్జీలు సుమారుగా 50కోట్లు బకాయి పడిరది. ఈ మొత్తాలు తక్షణమే చెల్లించకుంటే రష్యా నుంచి జూపిటర్ వెజల్ ద్వారా 75 వేల మెట్రిక్ టన్నులు, ఆస్ట్రేలియా నుంచి క్యాప్ వెజల్ ద్వారా 1.50 వేల మెట్రిక్ టన్నుల దిగుమతి అయిన బొగ్గు ఓడల నుంచి దించబోమని పోర్ట్ హుకుం జారీ చేసింది. దీంతో రెండు ఓడల్లో 3లక్షల టన్నుల బొగ్గు అన్లోడిరగ్ కాకుండా నిలిచిపోయింది. దీంతో ఉక్కుకు చిక్కులు మొదలయ్యాయి. ఉక్కులో అత్యవసరంగా వినియోగం కోసం ఉంచిన నిల్వలు తగ్గుతుండటంతో ఉత్పత్తిని తగ్గిస్తూ వస్తున్నారు. 15వేల మెట్రిక్ టన్నుల నుంచి 13వేల మెట్రిక్ టన్నులకు ఇలా తగ్గిస్తూ వస్తున్నారు. ఆఘామేఘాల మీద బకాయి సొమ్ము చెల్లించడం ఉక్కు తక్షణ కర్తవ్వంగా కన్పిస్తుంది. విశాఖ ఉక్కు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహారణ ప్రకటన అనంతరం కార్మికులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఉక్కును ప్రవేటీకరించే విషయంలో కేంద్రం తగ్గేదేలే అంటూ మొండి వైఖరి అవలంభిస్తూ వస్తుంది. దీన్ని అటు కార్మిక, ఇటు నిర్వాసిత వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఉక్కును ప్రవేటీకరిస్తే తమ భూములు వెనుక్కివ్వాలన్న నిర్వాసితుల ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ప్రజా అవసరాల కోసం అంటూ ఉక్కు భూములు గంగవరం పోర్ట్కిచ్చిన ఉక్కు యాజమాన్యం ఇప్పుడు పోర్ట్ ప్రవేటీకరణతో తమ చిక్కులు తామే తెచ్చుకున్నట్టయ్యింది. పోర్ట్ విసిరిన బకాయి వలలో చిక్కుకుని గిలగిల్లాడుతుంది. ఉక్కు ఉత్పత్తి తగ్గించేకు బొగ్గు కుత్రిమ సమస్య దోహదపడ్తుందని కార్మిక వర్గం వాపోతుంది. అసలే ప్రవేటీకరణకు ఉవ్విళ్లూరుతున్న కేంద్రానికి ఉత్పత్తి తగ్గింపు ఒక అస్త్రంగా పనిచేస్తుందంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ రంగం ప్రజా సంక్షేమం కోరుకుంటే ప్రవేటురంగం లాభాలే కోరుకుంటుందన్న కఠోర వాస్తవం గంగవరం పోర్ట్ లోతుల్లోంచి బహిర్గతమైంది.