అమీర్ ఖాన్ కుమార్తె ఐరాఖాన్ సుపరిచితమే. అమ్మ డు తండ్రి వారసత్వాన్ని పుణకి పుచ్చుకుని నటి కాలేదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఫిట్ నెస్ ట్రైనర్ నపుర్ నపూర్ తో ప్రేమలో పడటం… నిశ్చితార్దం జరగడం తెలిసిందే. దీంతో ఐరాఖాన్ మరింత ఫేమస్ అయింది. ఇద్దర్నీ కరోనా వైరస్ ఒకటి చేసింది.ఆ సమయంలోనే నపూర్ తో ప్రేమలో పడటం..డాడ్ కి విషయం చెప్పడం… ఆయన అంగీకరించడం..అంతా ఒకే చోట చిలౌట్ అయిన వీడియోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా ఐరాఖాన్ నెట్టింట బాగా ఫేమస్ అయి ంది. అయితే అమీర్ ఖాన్ కుమార్తె కావడంలో వల్ల వ్యక్తిగత జీవి తంలో తానెంత ఇబ్బం ది పడిరదో తాజాగా ఓ ఇంట ర్వ్యూలో వివరించింది. స్టార్ కిడ్ హోదా మాన సికంగా తానెంతో కృంగిబాటుకి గురైందో తెలిపింది. మానసిక వేదనికి ఒక కారణమంటూ ఉండ దు. చుట్టూ ఉండే పరిసరాలే మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తారు. స్టార్ కుటుంబంలో పెరగడం నా మానసిక స్థితిని ప్రభావితం చేయ లేదని చెప్పడం పిచ్చితనం అవుతుంది. ఇలాంటి కుటుంబంలో భాగం కావడం వల్ల నా మానసిక ఆరోగ్యం దెబ్బతింది. స్టార్ కిడ్ గా ఉండటం కొన్నిసార్లు మనకి ఉపయో గపడకపోవచ్చు. ఒకానొక సమయంలో మానసిక ఒత్తిడిని.. భయం నన్నెంతో వేధించాయి. ఏడాదిలో కొన్ని సార్లు కుంగుబాటుకు లోనయ్యే దాన్ని. మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం పట్టేది. నాలాగే కుంగు బాటుతో ఇబ్బంది పడు తోన్న వారి కోసం అగస్తు అనే పౌండేషన్ మొదలుపెట్టాను. దాదాపు ఏడాదిన్నర పాటు ఏమీ చేయలేదు. ఆ తర్వాత నెమ్మదిగా నాలా మానసిక ఇబ్బందులు ఎదుర్కున్న వారిని గుర్తించి ట్రీట్ చేయడం ప్రారం భించా. దాన్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి. దీనికి గురించి నాన్నతో అప్పుడప్పుడు చర్చిస్తా. ఆయన విలువైన సల హాలు.. సూచనలు ఇస్తుంటారు. ఆయన సహ కారం నన్ను ఎంతో ముందుకు తీసుకెళ్తుంది’ అని అంది.