ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఒక యువతి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటనపై కొత్తపేట పోలీసుల కేసు నమోదు చేశారు. కొత్తపేట ఎస్సై మణికుమార్ తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తపేట మండలం వాడపాలేనికి చెందిన బండారు శివాని(21), అదే గ్రామానికి చెందిన పిల్లా విజయ్ ప్రేమించుకున్నారు.
శివాని తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు కోరినా కాలయాపన చేయడంతోపాటు నిరాకరించాడు. దాంతో మనస్థాపానికి గురైన ఆమె ఈ నెల 11న ఎలుకల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు తండ్రి బండారు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ తెలిపారు.