న్యూఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 14 : విండీస్‌తో టెస్టు రెండో రోజు కూడా భారత జట్టు పూర్తి ఆధిపత్యం చెలా యించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన శతకంతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా భారీ శతకంతో జట్టులో తన అరంగేట్రాన్ని మధురానుభవంగా మార్చుకున్నాడు. రెండో రోజు చివరకు కూడా అతను నాటౌట్‌గా నిలిచా డు. మూడో రోజు ఆటలో అతను డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యం లేదు.అయితే ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను కేవలం ఆరు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా మంచి కంపోజర్ చూపించాడు. రోండో రోజు ఆట ముగిసే సమయానికి 96 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే కోహ్లీ ఇన్నింగ్స్‌లో ఒక విషయం అందరి దృష్టినీ ఆకర్షించింది.టెస్టుల్లో అయినా సరే ఎప్పుడూ బౌలర్లపై ఎదురు దాడి చేయడానికే కోహ్లీ ఇష్టపడతాడు. అది కూడా తనకు ఇష్టమైన కవర్ డ్రైవ్ లెంగ్త్‌లో బంతి పడితే దాన్ని బౌండరీకి పంపకుండా వదలడు.