విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 14: జీ`20సమావేశాల సందర్భంగా భారత నావికా దళం ‘ది ఇండియన్ నేవీ క్విజ్ (థిన్‌క్యూ20)’ పేరిట స్కూల్ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. 9నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు రెండు దశల్లో జాతీయ, అంతర్జాతీయ రౌండ్లు క్విజ్ నిర్వహిస్తోన్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ విధానంలో ప్రిలిమ్స్, సెమీ ఫైనల్, ఫైనల్స్‌ను ముంబయిలోని గేట్ వే ఇండియా వద్ద నిర్వహించనున్నారు. ప్రతిభ కనబర్చిన అభ్యర్థుల్ని ఇండియా టీం పేరిట న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్వహించనున్న ఇంటర్నేషనల్ రౌండ్‌కు తీసుకువెళ్తామని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. పాఠశాల యాజమాన్యాలు ఈ మేరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ది ఇండియన్ నేవీ క్విజ్.ఇన్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకోవచ్చని ఆ ప్రకటనలో అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుకు ఆఖరి తేదీ ఈ నెల 31 అని వివరించారు.