గరుగుబిల్లి, న్యూస్లీడర్, జూలై 14: మాకొద్దీ తెల్లదొరతనం అంటూ వినుతికెక్కిన గరిమెళ్ల సత్యనారాయణ సాహసాన్ని గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. బ్రిటీషోడి దురాగత పాలనను ఎండగట్టి భరత జాతిని జాగృతం చేసిన పెద్దాయన గొప్పతనాన్ని స్మరించుకునే సమయం. గరిమెళ్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన సేవల్ని భరత జాతి గుర్తు చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే. ఈ సందర్భంగా మన్యం పార్వతీపురం జిల్లా గరుగుబిల్లి మండలం నాగూరుకు చెందిన ప్రముఖ కార్టూనిస్టు, రంగుల చిత్ర కారుడు పీపీ నాయుడు మాస్టారు గరిమెళ్లకు శుక్రవారం నఖచిత్రం గీసి నివాళురల్పించారు. గరిమెళ్ల చిత్రాన్ని గోటితో రూపొందించగా అది ప్రస్తుతం అందరి అభిమానాన్ని చూరగొంటోంది.