విశాఖపట్నం, న్యూస్ లీడర్, జూలై 15 రైల్వేకు సంబంధించిన ఏ సమాచారమైనా ప్రస్తుతం ఆన్ లైన్ లో ఉంటోంది. అయితే ఆ సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా కొందరు ఇబ్బందులు పడుతుంటారు. అటువంటివారికి ఈ ఫోన్ నెంబర్లు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ప్రజలు తమ అవసరాలకు అనుగుణంగా సమాచారాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలుసుకుందాం. మనం బుక్ చేసుకున్న టికెట్ పొజిషన్ ను తెలుసుకోవడానికి అందులో ఉండే నెంబరు ద్వారా తెలుసుకోవచ్చు.139కు రద్దు/ఫేర్ ఎంక్వైరీ, సీట్ లభ్యత, ప్రస్తుత రైలు నడుస్తున్న స్థితి), 138 (ఫిర్యాదు సంఖ్య), 1800111139 (సాధారణ విచారణ) నెంబర్లు ద్వారా మీకు కావల్సిన సమాచారాన్ని పొందొచ్చు. మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ఉన్న దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేందుకు సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్‌లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు ప్రస్తుతం 23 మార్గాల్లో తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ నడుస్తున్నాయి. ఈ నెలలోనే విజయవాడ-చెన్నై మార్గంలో మరొకటి అందుబాటులోకి తీసుకువచ్చింది.