న్యూఢిల్లీ, న్యూస్ లీడర్, జూలై 15: తూర్పు కోస్తా రైల్వేలోని వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ శత్పతి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్తగా ఐఆర్ఎస్ఎంఈకి చెందిన సౌరభ్ ప్రసాద్ రానున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డ్ డైరెక్టర్ రవీందర్ పాండే శనివారం ఉత్తర్వులు సిఫారసు చేస్తూ రైల్వే జనరల్ మేనేజర్ ల కు లేఖ కూడా రాశారు. సంబంధిత ఆర్డర్ కాపీని ఆయా విభాగాల అధికారులకు కూడా పంపించారు.