ప్రేమించిన యువకుడు తనను పెళ్లి చేసుకునేందుకు కట్నం అడిగాడనే ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శొంఠి నాగదుర్గ(19) తన తల్లిదండ్రులు మృతి చెందడంతో ముదినేపల్లి మండలం శ్రీహరిపురం శివారు చేవూరుపాలెంలో ఉంటుంది.
ఇంటర్ వరకు చదివిన నాగదుర్గకు ఎనిమిది నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో కృష్ణాజిల్లా గాయంపాడుకు చెందిన వాలంటీరు, ఆటోడ్రైవర్ శివనాగరాజుతో పరిచయమైంది. విషయం కుటుంబ సభ్యులకు తెలిసి సదరు వ్యక్తిని పెళ్లిచేసుకోమని అడగగా రూ.2 లక్షలు కట్నం ఇవ్వాలని పట్టుబట్టాడు. ఇది తెలిసి నాగదుర్గ మనస్తాపం చెంది ఈ నెల 7న ఇంటి వద్ద ఆత్మహత్యకు యత్నించింది. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది.