సీతానగరం, న్యూస్‌లీడర్, జూలై 18 : సైకిల్‌పై వెళ్తుండగా మూర్ఛ (ఫిట్స్) రావడంతో చెరువులో పడి విద్యార్థిని మృతి చెందింది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
సీతానగరం మండలంలోని ఆవాలవలస గ్రామానికి చెందిన ఆవాల శ్రావణి(14) గాదెలవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. యథావిధిగా మంగళవారం ఉదయం శ్రావణి సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా.. మార్గంమధ్యలో ఫిట్స్‌కు గురైంది. దీంతో రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి జారిపడిరది. దీన్ని గమనించిన మరో విద్యార్థి.. శ్రావణి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. స్థానికులు, కుటుంబసభ్యులు చెరువులోకి దిగి విద్యార్థినిని బయటకు తీశారు. అయితే అప్పటికే శ్రావణి మృతి చెందింది. విద్యార్థినిపై సైకిల్ పడటంతో ఆమె బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సత్యం, పార్వతి దంపతులకు శ్రావణి ఏకైక సంతానం. తమ కుమార్తె మృతితో వారు కన్నీరుమున్నీరయ్యారు. శ్రావణి మృతితో గాదెలవలస, ఆవాలవలస గ్రామాలు విషాదంలో మునిగిపోయాయి.