బేబీ సినిమా బా క్సాఫీస్ వద్ద రోజురోజుకు మ రింత డోస్ పెంచుతూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పెద్దగా అంచనాలు లేకు ండా వచ్చిన ఈ సినిమా కంటెంట్ తోనే మెల్ల మెల్లగా కలెక్షన్స్ నెంబర్లను అయితే పెంచుకుంటోంది. అసలు ఈ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ఆనంద్ దేవరకొండకు ఇది బెస్ట్ మూవీ అవుతుంది అని చెప్పవచ్చు. వైష్ణవి చైతన్య హీరోయిన్గా మొదటి సినిమాతోనే జాక్‌పాట్ కొట్టేసింది. అయితే ఈ సినిమాకు మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్షన్స్ రాగా ఇక మూడవరోజు అంతకుమించి అనేలా కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాం ఏరియా లో అయితే రెండవ రోజు పెట్టిన పెట్టుబడికి మొత్తం వెనక్కి తీసుకువచ్చి బయ్యర్లను ప్రాఫిట్ లో పడేసింది. ఇక వీకెండ్లో హౌస్‌ఫుల్ కలెక్షన్స్ రావడం అనేది సర్వసాధారణమైన విషయం. ఇక సోమవారం రోజు
పెద్ద సిని మాలకు కూడా కలెక్షన్స్ చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఇక హౌస్ ఫుల్ బోర్డులు అనేవి కనిపిస్తే చాలు గొప్ప. ఈ మధ్య ప్రభాస్ ఆదిపురుష్‌కు కూడా ఫస్ట్ మండే తెలుగు రాష్ట్రాల్లో హౌస్ ఫుల్ బోర్డులు పెద్దగా పడలేదు. కానీ బేబీ సినిమా మాత్రం హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది. అది కూడా మాస్ ఏరియాలలో బీభత్సమైన క్రేజ్ అందుకో వడం విశేషం. రాయలసీమ వంటి మాస్ ఏరియాలలో కూడా ఈ సినిమాకు హౌస్ ఫుల్బోర్డులు పడ్డాయి. ఇక కడప కర్నూలు తిరుపతి ఏరియాలలో కూడా ఫస్ట్ షోలకు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆంధ్ర ప్రాంతంలో వైజాగ్ లాంటి పెద్ద సిటీలలో కూడా ఈ సినిమాకు అయితే హౌస్ ఫుల్ బోర్డు లు పడినట్లుగా తెలుస్తోంది ఇక నైజం లో అయితే మొదటి నుంచి కూడా ఈ సినిమా అదేదో రేంజ్ లో నడుస్తోంది. మొత్తంగా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో కూడా 60% నుంచి 70% వరకు ఆక్యుపెన్సీ అయితే నమోదయింది.