పెళ్లి చేసుకుంటానని ఎస్టీ బాలికను మోసం చేసి ఏడు నెలల గర్భవతిని చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు అరండల్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. తెనాలి మండలం పెదరావూరుకు చెందిన పదో తరగతి తప్పిన ఓ బాలిక తన అమ్మమ్మ అంబారీ ప్రమాదంలో గాయపడటంతో ఆమెకు తోడుగా ఉంటూ పనులు చేసి పెట్టేందుకు గుంటూరులోని రాజీవ్‌గాంధీనగర్‌కు వచ్చింది.
కొంత కాలంగా ఆ బాలిక ఇక్కడే ఉంటుంది. ఆమెకు బావ వరసయ్యే ఓ హోటల్లో పని చేస్తున్న భీముడు నాయక్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్నాళ్లుగా శారీరకంగా దగ్గరయ్యాడు. దీంతో ఆమె ఏడు నెలల గర్భవతి అయింది. ఈ విషయం పెద్దలకు చెప్పవద్దని బాలికను లొంగదీసుకొన్నాడు. బాలికలో మార్పును చూసి అనుమానం వచ్చి పెద్దలు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం అంతా చెప్పింది.
భీముడు నాయక్‌ను బాలిక తరఫు వారు పెళ్లి చేసుకోమని కోరారు. అందుకు నిందితుడు ఒప్పుకోలేదు. తాను కారణం కాదని ప్లేటు మార్చాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.