సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తరువాత పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ కి జోడీగా నటించింది. అలాగే తమిళంలో జయం రవికి జోడీగా భూమి మూవీలో జటించింది. అలాగే శింబుకి జోడీగా ఈశ్వరన్ చిత్రంలో మెరిసింది. చివరిగా గల్లా అశోక్ కి జోడీగా హీరో చిత్రంతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే స్టార్ హీరోయిన్ ఫేమ్ కోసం ఈ బ్యూటీ చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తోంది. అనుకోని అవకాశంగా హరి హర వీర మల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. క్రిష్ జగర్లమూడి దర్శకత్వం తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడిరది. రెండేళ్ళ నుంచి ఈ మూవీ షూటింగ్ జరుపు కొంటోంది. సినిమాపై నిధి అగర్వాల్ చాలా హోప్స్ పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా నిధి పాప తన సోషల్ డ్రీమ్ ఓకే రిలీజ్ ఎప్పుడు?మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో నా డ్రీమ్ నిజమైంది. హరి హర వీర మల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ క్రిష్ జగర్లమూడి ఎం.ఎం. కీరవాణి లాంటి అద్భుతమైన స్టార్స్‌తో పని చేయడం అదృష్టం గా భావిస్తున్నాను. మీకు త్వరలోనే ఈ సినిమా నుంచి ఈ మ్యాజిక్ చూస్తారని పేర్కొంది. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి రెండేళ్ళు అవుతోంది. ఇప్పటికి షూటింగ్ కంప్లీట్ కాలేదు. ఓ వైపు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు పెండిరగ్ షూట్ కంప్లీట్ చేయ కుండా భీమ్లా నాయక్ కంప్లీట్ చేశారు. బ్రో మూవీ రిలీజ్‌కి రెడీ అయిపోతోంది. ఇప్పుడు సుజిత్ దర్శక త్వంలో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. క్రిష్ కూడా హరిహర వీరమల్లు సినిమాని నమ్ముకొని ఉన్నా రు. అయితే మూవీ ఎటు కదలకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ పైకి వెళ్ళలేకపోతున్నారు. రిలీజ్ డేట్ ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.