డెహ్రాదూన్ : ఉత్తరాఖండ్‌లో ట్రాన్స్ఫార్మం పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు కూడా ఉన్నారు. ఘటనలో పలువురు గాయపడ్డారు. చమోలీ జిల్లాలోని అలకనందా నదిపై ఉన్న ఓ వంతెన వద్ద ఈ ప్రమాదం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి.
నమామీ గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనందా నదిపై ఉన్న వంతెనకు విద్యుత్ ప్రవాహం జరగడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం వల్ల వంతెన రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవహించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. వారిలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, హోం గార్డులు ఉన్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నామని ఉత్తరాఖండ్ ఏడీజీపీ వి.మురుగేశన్ వెల్లడిరచారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పరిశీలించనున్నారు.