పరువు నష్టం కేసులో సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులకు నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టు మంగళవారం ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. వారు 2011లో చిరంజీవి బ్లడ్బ్యాంకుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ సినీ నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జరిమానా చెల్లించడంతో అప్పీలుకు అవకాశమిస్తూ రాజశేఖర్ దంపతులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.