పాపులర్ హాలీవుడ్ దర్శకు డు నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న సంగ తి తెలిసిందే. అభిమానుల భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం భారత దేశంలోను రికార్డులు సృష్టించ డం ఖాయమన్న టాక్ వినిపి స్తోంది. ముంబై సహా మెట్రో నగరాల్లో ఐమ్యాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా అత్యంత భారీగా విడుదలవుతోంది. పూర్తిగా ఐమ్యాక్స్ కెమె రాలతో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా కథాంశం ఆసక్తికరం. తాజాగా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో సిలియన్ మర్ఫీ ‘ఓపెన్ హైమర్’ షూటింగ్ డేస్ గురించిన రహస్యాన్ని రివీల్ చేసారు. ఓపెన్ హైమర్ కేవలం 57 రోజుల్లోనే తెరకెక్కిందని ఆయన వెల్లడిరచడం షాకిస్తోంది. నిజానికి ఏ హాలీవుడ్ భారీ చిత్రం ఇన్ని తక్కువ పనిదినాల్లో తెరకెక్కినట్టు మనం వినలేదు. నోలన్ లాంటి ఠఫ్ మాస్టార్ ఇంత తక్కువ సమయంలో సినిమాని పూర్తి చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.