తమిళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కోలీవుడ్‌లో తన సినీ ప్రస్థానంను మొదలు పెట్టింది. యంగ్ స్టార్ హీరోలకు జోడీగా కీర్తి సురేష్ చాలా సినిమాలో నటించింది. తెలుగులో నేను శైలజ సినిమాతో మంచి పేరును సొంతం చేసుకుంది. ఆ సమయం లోనే ‘మహానటి’ వంటి ఒక మంచి సినిమాలో నటించే అవకాశం కీర్తి సురేష్‌కి రావడంతో వెనక్కి తిరిగి చూసు కోకుండా స్టార్ డం లభించింది. మహానటి సినిమా కేవలం తెలుగు భాషకు పరిమితం అవ్వలేదు.. పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ ఒకవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరో వైపు హీరోలకు జోడీగా కమర్షియల్ సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే వాటిల్లో కొన్ని మరీ తీవ్రంగా నిరాశ పరిచాయి. సక్సెస్.. ఫ్లాప్స్‌తో సంబంధం లేకుం డా టాలీవుడ్.. కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్‌కి తాజాగా బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. కీర్తి సురేష్ మొదటి బాలీవుడ్ సినిమా కన్ఫర్మ్ అయింది. తమిళ దర్శకుడు కాలీస్ దర్శకత్వంలో బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా రూపొందబోతున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపిక అయింది. ఇప్పుడు వెంటనే మరో సౌత్ స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్‌తో నటిం చేందుకు ఓకే చెప్పడం జరిగింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. మే 31 – 2024న సినిమా విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. కోలీవుడ్‌లో కాస్త పర్వాలేదు అన్నట్లుగా కీర్తి సురేష్ కెరీర్ సాగుతుంది. గత ఏడాది మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట మంచి విజ యాన్ని సొంతం చేసుకుంది.