ఇస్లామాబాద్, న్యూస్ లీడర్, జూలై 19: పాకిస్థాన్ పార్లమెంటును ఆగస్టు 8వ తేదీన రద్దు చేయాలని అధికార కూటమి నిర్ణయించింది. వాస్తవానికి ఆగస్టు 12వ తేదీ వరకూ పార్లమెంటుకు గడువుంది. అయితే సాధారణ ఎన్నికలకు మరింత సమయం తీసుకోవాలనే సాంకేతిక కారణంతో నాలుగు రోజులు ముందుగా పార్లమెంటును రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వంలో పీఎంఎల్ (నవాజ్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య రద్దుపై అవగాహన కుదిరింది. పాకిస్థాన్ చట్టాల ప్రకారం పార్లమెంటు రద్దును అధ్యక్షుడు ఆమోదించకపోతే 48 గంటల తర్వాత దానంతటదే రద్దవుతుంది.