న్యూయార్క్ : ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఉన్నతస్థాయి వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఉపన్యాసకుల జాబితాను ఐరాస వెల్లడిరచింది. ఆ ప్రకారం సెప్టెంబరు 19న సమావేశాలు ప్రారంభం కాగానే తొలిగా అమెరికా, అనంతరం బ్రెజిల్ దేశాల నేతలు ఉపన్యసిస్తారు. అదే నెల 22న మధ్యాహ్నం భారత ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఈ షెడ్యూల్లో చివరి వరకూ మార్పులుచేర్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.