సమంత ఖుషి.. సిటాడెల్ షూటింగ్స్ ముగిసిన వెంటనే సినిమాలకు… సిరీస్ లకు పూర్తిగా బ్రేక్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించింది. అన్నట్లుగానే కొత్త ప్రాజెక్ట్‌లను సమంత మొదలు పెట్టడం లేదు. అంతే కాకుండా ప్రస్తుతం విడుదల కు సిద్ధం అవుతున్న ప్రాజెక్ట్‌ల ప్రమోషన్ కార్యక్రమాలకు అయినా సమంత మీడియా ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే సమంత కమిట్ అయిన మూడు నాలుగు సినిమాలను క్యాన్సల్ చేసుకుందట. ఆ నిర్మాతల నుండి తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా సమంత తిరిగి ఇచ్చేసిందట. ఏడాది తర్వాత ఎలాగూ బ్రేక్ నుండి తిరిగి వస్తారు కదా.. అప్పుడే తమ సినిమాల్లో నటించాల్సిందిగా నిర్మాతలు కోరినా కూడా సమంత మాత్రం అడ్వాన్స్‌లు తన వద్ద ఉంచుకోవాలనుకోవడం లేదని చెప్పేసిందట. నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లు పెద్ద మొత్తంలో ఉండటంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఉన్న కమిట్మెంట్స్ను కూడా సమంత వదిలేసుకుంది. బ్రేక్ తర్వాత ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు ఉంటే వెంటనే చేస్తుందని అనుకున్న వారికి ఈ విషయం షాకింగ్‌గా ఉంది అంటున్నారు. సమంత ఏడాది తర్వాతైనా సినిమాలు చేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అడ్వాన్స్‌లు ఏళ్లకు ఏళ్లు పెట్టుకుని సినిమాలు చేసే హీరోలు హీరోయిన్స్ ఉంటారు. కానీ సమంత మాత్రం ఒక్క ఏడాదికే అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని అనుకోవడానికి కారణం ఏంటో అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల టాక్. మయో సైటిస్ అనే అనారోగ్య సమస్యతో ఒకానొక సమయంలో సమంత కనీసం నిల్చోవడానికి కూడా ఇబ్బంది అయింది. ఆ సమస్య నుంచి మెల్ల మెల్లగా కోలుకుని ఖుషి.. సిటాడెల్ షూటింగ్స్‌ను ముగించింది. షూటింగ్ లో అయితే పాల్గొంది కానీ మయో సైటిస్ సమస్య ఆమెను బాధిస్తూనే ఉందట. అందుకే ఏడాది పాటు పూర్తి విశ్రాంతి తీసుకుని చికిత్స తీసుకోవాల ని సమంత భావిస్తుందని.. అందుకే బ్రేక్ తీసుకుందని తెలుస్తోంది.