హైదరాబాద్, న్యూస్లీడర్, జూలై 19: ‘మిథునం’ సినీ కథా రచయిత, ప్రముఖ కథకుడు, వ్యంగ్య వ్యాస రచయిత శ్రీరమణ ఇకలేరు. పేరడీ రచనలో సుప్రసిద్ధులు ఆయన. శ్రీరమణ బాపు, రమణలతో కలిసి పనిచేశారు. 70 యేళ్ల వయసున్న శ్రీరమణ గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటలను కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. శ్రీరమణ ‘పత్రిక’ అనే మాసపత్రికకు గౌరవ సంపాదకుడిగా ఉన్నారు. ఆయన హాస్యరచన విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం 2014 కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా, వేమూరు మండలం, వరహాపురం అగ్రహారంలో 1952 సెప్టెంబరు 21న జన్మించారు.
సీఎం జగన్ సంతాపం …
ప్రముఖ కథా రచయిత శ్రీరమణ మృతి సాహితీ లోకానికి తీరని లోటని సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆయన రాసిన కథలు సామాజిక విలువలతో మిళితమై ఉన్నాయని, సమాజ శ్రేయస్సు కోసమే ఆయన తపనపడేవారని అన్నారు. మిథునం కథ నుంచి వచ్చిన సినిమా ఇందుకు ఓ ఉదాహరణ అని అన్నారు.