విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జులై 19 : స్టీల్‌ప్లాంట్ రిటైర్డ్ జనరల్ మేనేజర్, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి తండ్రి గుడిమెట్ల సత్తిరెడ్డి (85) అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు జి.మధుకుమార్ డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలకు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. రెండో కుమారుడు రవిరెడ్డి వైసీపీ నాయకుడు. సత్తిరెడ్డి భౌతికకాయాన్ని బుధవారం సాయంత్రం 4 గంటల వరకు మిత్రులు, శ్రేయోభిలాషుల సందర్శనార్ధం సాగర్‌నగర్‌లోని వారి స్వగృహంలో ఉంచనున్నారు. సత్తిరెడ్డి మృతి పట్ల నగర ప్రముఖులు, అధికారులు సంతాపం తెలియజేశారు. సత్తిరెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీవేమన సంక్షేమ సంఘం అధ్యక్షులు నీలాపు వివేకానంద రెడ్డి, బుల్లయ్య కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు ప్రగాఢ సంతాపం తెలిపారు
విద్యాప్రదాత..
గుడిమెట్ల సత్తిరెడ్డి మెటీరియల్ మేనేజ్మెంట్ ఫౌండర్‌గా విశాఖపట్నానికి సర్టిఫికెట్ కోర్సు ద్వారా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారు. ఎందరో విద్యార్థులు దేశవిదేశాల్లో ఉన్నతమైన చదువులు అభ్యసించేలా చేశారు. బీహెచ్‌పీవీలో మేనేజర్‌గా విధులు నిర్వహించి, తరువాత స్టీల్‌ప్లాంట్‌లో జనరల్ మేనేజర్ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు.