విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 22: వాల్తేరు రైల్వే కొత్త డీఆర్ఎంగా సౌరభ్ ప్రసాద్ శుక్రవారం విశాఖలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన ఆనూప్ శత్పతిని బదిలీ చేసినా ఇప్పటి వరకూ ఎక్కడా బాధ్యతలప్పగించలేని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే 1991ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన సౌరభ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. కేంద్ర రైల్వేలో రైళ్ల రాకపోకలపై ఆయనకు మంచి అనుభవం ఉంది. వివిధ ప్రాజెక్టుల్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. వెస్ట్రన్ రైల్వే, వెస్ట్ సెంట్రల్ రైల్వే, కొంకణ్ రైల్వేలోని పలు విభాగాల్లో పనిచేశారు. ఇప్పటి వరకు ఆయన సెంట్రల్ రైల్వేలోని చీఫ్ రోలింగ్ అధికారిగా పని చేసి తూ.కో రైల్వేలోని వాల్తేరు డీఆర్ఎంగా వచ్చారు, ముంబయిలో వందేభారత్ రైలు రూపకల్పనలోనూ ఆయన భాగస్వామ్యం ఉంది. రైల్వే వ్యవస్థలో ఆయనకు పూర్తి అనుభవం ఉంది. అంతేకాకుండా ఆయన విదేశాల్లోనూ చదువుకున్నారు. పలు అంశాలపై శోధించినందుకు ఆయనకు బంగారు పతకం కూడా సాధించారు. రైల్వేలో కూడా ఆయనకు జాతీయ స్థాయి అవార్డు లభించిందని సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.